ఆన్‌లైన్ సేవలను బలోపేతం చేయండి

సేవలను బలోపేతం చేయండి


 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ

 

 

సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో వివిధ రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని, వాహన వినియోగదారులు ఇంటి వద్ద నుంచే పౌర సేవలను పొందే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఆయన వచ్చారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సీఎస్ వెంట ఉండి డ్రైవింగ్ లెసైన్సు ప్రక్రియను పూర్తి చేశారు. రెన్యువల్ కోసం సీఎస్ రాజీవ్‌శర్మ ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు.  ఆ సమయంలో వినియోగదారుల రద్దీ, పౌరసేవల కోసం నెలకొన్న డిమాండ్ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారానే అన్ని రకాల రవాణా సేవలు లభించే విధంగా చూడాలన్నారు.కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్‌లైన్ సేవలను గురించి వివరించారు. అలాగే ఆర్టీఏ ఫీజును ఈ సేవ, ఆన్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించే విధంగా ప్రవేశపెట్టిన నగదు రహిత సేవల గురించి సీఎస్‌కు చెప్పారు. త్వరలో ప్రతి పౌరసేవకు ఆన్‌లైన్‌లోనే స్లాట్ నమోదు చేసుకొనే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీఏ-ఎం వాలెట్ యాప్ ద్వారా 7 లక్షల మందికి పైగా తమ డ్రైవింగ్ లెసైన్సులను, ఆర్సీలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు చెప్పారు.

 

 

 

 సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో వివిధ రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని, వాహన వినియోగదారులు ఇంటి వద్ద నుంచే పౌర సేవలను పొందే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఆయన వచ్చారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సీఎస్ వెంట ఉండి డ్రైవింగ్ లెసైన్సు ప్రక్రియను పూర్తి చేశారు. రెన్యువల్ కోసం సీఎస్ రాజీవ్‌శర్మ ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు.  ఆ సమయంలో వినియోగదారుల రద్దీ, పౌరసేవల కోసం నెలకొన్న డిమాండ్ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారానే అన్ని రకాల రవాణా సేవలు లభించే విధంగా చూడాలన్నారు. కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్‌లైన్ సేవలను గురించి వివరించారు. అలాగే ఆర్టీఏ ఫీజును ఈ సేవ, ఆన్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించే విధంగా ప్రవేశపెట్టిన నగదు రహిత సేవల గురించి సీఎస్‌కు చెప్పారు. త్వరలో ప్రతి పౌరసేవకు ఆన్‌లైన్‌లోనే స్లాట్ నమోదు చేసుకొనే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీఏ-ఎం వాలెట్ యాప్ ద్వారా 7 లక్షల మందికి పైగా తమ డ్రైవింగ్ లెసైన్సులను, ఆర్సీలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు చెప్పారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top