చైన్ స్నాచర్ భలే దొరికిపోయాడు | chain snatcher arrested in hyderabad | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్ భలే దొరికిపోయాడు

Dec 2 2015 6:35 PM | Updated on Sep 4 2018 5:07 PM

చైన్ స్నాచర్ భలే దొరికిపోయాడు - Sakshi

చైన్ స్నాచర్ భలే దొరికిపోయాడు

నెల రోజుల క్రితం ఓ చైన్స్నాచర్ హైదరాబాద్ రాంనగర్లో ఓ మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు దొంగిలించాడు.

హైదరాబాద్ సిటీ: నెల రోజుల క్రితం హైదరాబాద్లో చైన్ దొంగిలించిన ఓ దొంగ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గత నెలలో రాంనగర్లో ఓ మహిళ కళ్లలో కారం కొట్టి దుండగుడు బంగారు గొలుసు దొంగిలించాడు. అదే సమయంలో ఆమె సెల్ఫోన్ను కూడా ఎత్తుకుపోయాడు. దీనిపై బాధిత మహిళ స్మిత రెండున్నర తులాల మంగళసూత్రం గొలుసుతో పాటు సెల్ఫోన్ అపహరణకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నెల రోజుల తర్వాత దొంగ ఆ సెల్‌ఫోన్‌లో సిమ్ వేయడంతో పోలీసులు ట్రాప్ చేసి...ఆ చైన్స్నాచర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ దొంగ రాంనగర్ ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్(22)గా గుర్తించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement