హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ | chain Snacing in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్

Dec 26 2015 10:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చి పోయారు.

హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చి పోయారు. సరూర్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘనట చోటు చేసుకుంది. స్థానిక మహిళ పద్మ(25) ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. బైక్ పై వచ్చిన యువకులు ఆమె  మెడలో ఉన్న గొలుసు తెంచుకెళ్లారు. చోరీ అయిన బంగారం నాలుగున్నర తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరో ఘటనలో సైదాబాద్ పరిధిలోని రెడ్డి కాలనీ కి చెందిన శాంతి లత ఉదయం పాల కోసం రోడ్డు పై నడిచి వెళుతుండగా.. వెనక నుంచి బైక్ పై వచ్చిన అగంతకులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement