ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోనుంచి చైన్ స్నాచర్లు మూడు తులాల మంగళసూత్రం ఎత్తుకుపోయారు.
ఇంట్లో ఉన్నా వదలని చైన్ స్నాచర్లు
Nov 12 2016 4:35 PM | Updated on Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: పెద్ద నోట్ల మార్పిడి కోసం కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోనుంచి మూడు తులాల మంగళసూత్రం ఎత్తుకుపోయారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని శాలివాహన నగర్‌లో నివసించే ఎం.శ్రీనివాస్ సోదరి శనివారం ఉదయం ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి వచ్చింది.
శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లగా ఆయన భార్య వాణి, కూతురు శ్రావ్య ఇద్దరూ సమీపంలోని బ్యాంకుకు నగదు మార్పిడి కోసం వెళ్లారు. ఇంట్లో శ్రీదేవి ఒక్కరే ఉన్న సంగతి గమనించిన ఓ దుండగుడు లోపలికి ప్రవేశించి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకొని క్షణాల్లో మాయమయ్యాడు. షాక్‌కు గురైన శ్రీలక్ష్మి సృహతప్పి పడిపోయింది. బ్యాంకు నుంచి వచ్చిన వాణి, శ్రావ్య ఇద్దరూ రాగానే శ్రీలక్ష్మి అసలు విషయం చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


