'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం' | centre will coaperate to telangana: TS BJP | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం'

Apr 3 2016 1:37 PM | Updated on Apr 6 2019 9:38 PM

'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం' - Sakshi

'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం'

తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా విభజన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. కరువు చర్యల్లో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement