బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుందని వివరాలు సేకరించి ఆన్ లైన్ ద్వారా నగదు కాజేసిన సంఘటన ఇది.
బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుందని వివరాలు సేకరించి ఆన్ లైన్ ద్వారా నగదు కాజేసిన సంఘటన ఇది. బాధితుడు దాస్ కథనం ప్రకారం.. గత నెల 15 వ తేదీ అతని ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ ఎస్‌బీఐ ఖాతా నంబర్‌కు ఆధార్ కార్డు అనుసంధానం కాలేదని నమ్మించి కార్డు గడువు తేదీని కూడా తెలుసుకొని సుమారు రూ.14,535 పేటీం,ఎస్‌బీఐ బడ్డీకి బదలాంపు చేసుకున్నాడు. గురువారం బ్యాంక్ పనిమీద వెళ్లి పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేసుకున్న సమయంలో జరిగిన మోసాన్ని గుర్తించి శుక్రవారం గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఎంఎస్ అలర్ట్ సౌకర్యం కూడా నమోదు చేసుకున్నానని ఖాతాలో నుంచి నగదు తగ్గిన తర్వాత ఎస్‌ఎంఎస్ కూడా రాలేదని దాస్ తెలిపాడు. దీనిపై అతడు పోలీసులను ఆశ్రయించాడు.