ముగిసిన సినారె అంత్యక్రియలు | C Narayana reddy funerals at mahaprasthanam | Sakshi
Sakshi News home page

ముగిసిన సినారె అంత్యక్రియలు

Jun 14 2017 2:56 PM | Updated on Sep 5 2017 1:37 PM

ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి.

హైదరాబాద్‌: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. సినారె అభిమానుల, కుటుంబీకుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూసేందుకు కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు బొగ్గులకుంటలోని సారస్వత్‌ పరిషత్‌ నుంచి సినారె అంతిమయాత్ర చేపట్టగా వేలాదిమంది పాల్గొని తుది వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement