ఇక అదనపు ఎస్పీలపైనే భారం | Burden on the additional SPs | Sakshi
Sakshi News home page

ఇక అదనపు ఎస్పీలపైనే భారం

Mar 30 2017 12:41 AM | Updated on Sep 22 2018 8:25 PM

రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల కొరత వేధిస్తుండటంతో నాన్‌ కేడర్‌ అదనపు ఎస్పీలపై పోలీస్‌ శాఖ భారం వేయనుంది.

ఐపీఎస్‌ల కొరతతో జిల్లా ఎస్పీ, డీసీపీలుగా బాధ్యతలు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల కొరత వేధిస్తుండటంతో నాన్‌ కేడర్‌ అదనపు ఎస్పీలపై పోలీస్‌ శాఖ భారం వేయనుంది. ఉన్న కొద్దిపాటి ఎస్పీ స్థాయి ఐపీఎస్‌ అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల జిల్లా బాధ్యతల నుంచి పలువురిని తప్పించారు. ఇటీవల పదోన్నతి పొందిన పలువురు ఎస్పీలు, డీసీపీల స్థానా ల్లో అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. దీనితో అదనపు ఎస్పీలపై భారం వేసి నెట్టుకురావాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.

మహబూబాబాద్, వికారా బాద్‌ జిల్లాలకు ఎస్పీలుగా.. ఇద్దరు అదనపు ఎస్పీలను ఇన్‌చార్జి ఎస్పీలుగా నియమించ నున్నారు. పదోన్నతితో ఖాళీ అయిన హైద రాబాద్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌జోన్‌ డీసీపీ స్థానం, రాచకొండలోని ఎల్బీనగర్‌ డీసీపీ స్థానంలో ఇద్దరు అదనపు ఎస్పీలను ఓఎస్డీ గా (ఇన్‌చార్జి డీసీపీ)నియమించాలని అధికా రులు నిర్ణయం తీసుకున్నారు. క్రైమ్‌ డీసీపీల స్థానాల్లోనూ అదనపు ఎస్పీలను నియమిం చాలని పోలీస్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపించింది. 2 రోజుల్లో 8మంది అద నపు ఎస్పీలకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement