కన్నపేగే కర్కశంగా మారింది | boy beaten brutally by mother | Sakshi
Sakshi News home page

కన్నపేగే కర్కశంగా మారింది

May 6 2015 4:37 AM | Updated on Jul 12 2019 3:02 PM

కన్నపేగే కర్కశంగా మారింది - Sakshi

కన్నపేగే కర్కశంగా మారింది

నవ మాసాలు మోసిన తల్లే తన కన్న కుమారుడి పట్ల కర్కశంగా మారింది లాలించి గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో కాల్చిన కడ్డీతో వాతలు పెట్టింది.

హైదరాబాద్: నవ మాసాలు మోసిన తల్లే తన  కన్న కుమారుడి పట్ల కర్కశంగా మారింది లాలించి గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో కాల్చిన కడ్డీతో  వాతలు పెట్టింది. ఈ అమానవీయ ఘటన నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  సీఐ ఎన్.చంద్రబాబు కథనం ప్రకారం... మౌలాలికి చెందిన రేష్మ(22)కు డోర్నకల్‌కు చెందిన అమీర్‌పాషాతో 2008లో పెళైలంది. వీరికి ఇద్దరు కుమారులు. మనస్పర్థలు రావడంతో భార్యాభర్తలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. రేష్మా ఏడాది క్రితం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మహేష్‌తో రెండో వివాహం చేసుకుంది. పెద్ద కుమారుడు రేష్మా తల్లి దండ్రుల వద్ద ఉంటుండగా, చిన్న కుమారుడు ఆయాన్(5) రేష్మా, మహేష్‌లతో పాటు ఉంటున్నాడు.

కాగా రేష్మా సోదరుడు రిజాజ్ ఇటీవల ఆయాన్‌ను తమకు దత్తత ఇవ్వాలని అడిగాడు. దీంతో రూ. 50 వేలు ఇస్తే కుమారుడు ఆయాన్‌ను ఇస్తానని చెప్పింది. రిజాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో రేష్మా కుమారుడు ఆయాన్‌ను ఒంటిపై పెదవులు, పిరుదులు,కాళ్లు,చేతులు, మర్మాంగంపై ఈనెల 4న వాతలు పెట్టింది. రియాన్ తీసుకువెళ్లడానికి మంగళవారం ఇంటికి వచ్చిన రియాజ్ బాలుడి దుస్థితి చూసి వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు .

ఇదిలా ఉండగా కుమారుడు ఆయాన్ చెప్పినట్లు వినడం లేదని, కాలనీలో ఉన్న బాయి వద్దకు తరుచు వెళ్తున్నాడని, వెళ్లవద్దని వారించినావినడం లేదని దీంతో భయం పెట్టాలని ఉద్దేశంతో వాతలు పెట్టినటు రేష్మా చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఐపిసి 384,324,506 సెక్షన్‌లప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని పసిపిల్లాడి కర్కశంగా వాతలు పెట్టిన కన్న తల్లిపై హత్యా కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చేయాలని మానవ హక్కుల సంఘం నాయకులు అనురాధ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement