సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు | bomb threatening call to secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు

May 3 2015 4:17 PM | Updated on Sep 3 2017 1:21 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు

దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానం, దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడో నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద బాంబులు అమర్చినట్లు ఆదివారం మద్యాహ్నం ఓ అగంతకులు పోలీసులకు ఫోన్ చేశాడు.

దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానం, దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడో నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద బాంబులు అమర్చినట్లు ఆదివారం మద్యాహ్నం ఓ అగంతకులు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, సివిల్ పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 

 

అయితే స్టేషన్ లోనేకాక పరిసర ప్రాంతాల్లోనూ పేలుడు పదార్థాలేవీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ గా భావించి ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఫోన్ కాల్ ఆధారంగా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి..  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చందిన బాలయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement