అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ.. బ్యాంకు అధికారులు ఓ హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు.
అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ.. బ్యాంకు అధికారులు ఓ హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకుంది. హోటల్ నిర్మాణం, నిర్వాహణ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లంచడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఈ రోజు హోటల్ ముందు బ్యాంకు సిబ్బంది ధర్నాకు దిగారు.