నాగోలులోని మెట్రో డిపోను సందర్శించిన దత్తాత్రేయ | Bandaru Dattatreya visits nagole metro rail project depot | Sakshi
Sakshi News home page

నాగోలులోని మెట్రో డిపోను సందర్శించిన దత్తాత్రేయ

May 2 2015 2:03 PM | Updated on Oct 16 2018 5:04 PM

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నాగోల్లో మెట్రో రైలు డిపోను పరిశీలించారు. మెట్రో పనులను ఆయన పర్యవేక్షించారు.

హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నాగోల్లో మెట్రో రైలు డిపోను పరిశీలించారు.  మెట్రో పనులను ఆయన పర్యవేక్షించారు. దేశంలో అన్నింటికంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అధునాతనమైందని బండారు దత్తాత్రేయ అన్నారు. మెట్రో పనులు త్వరగా పూర్తి చేయటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని ఆయన తెలిపారు. మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చని ఆయన అన్నారు. కాగా నాగోల్ స్టేషన్ పేరును ఉప్పల్ స్టేషన్గా మార్చుతున్నట్లు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement