అవినీతిలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది:పీసీసీ | AP numer one in corruption: congress | Sakshi
Sakshi News home page

అవినీతిలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది:పీసీసీ

Oct 10 2016 7:50 PM | Updated on Mar 18 2019 9:02 PM

అవినీతిలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది:పీసీసీ - Sakshi

అవినీతిలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది:పీసీసీ

అవినీతిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌: అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి ఆరోపించారు. ఇందిర భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నా వాటి గురించి సీఎం చంద్రబాబు పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు.

అమరావతిని ఐదు అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా చేస్తానంటూ చెబుతూనే మరోవైపు అధికార వికేంద్రీకరణ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని చుట్టూ పర్యాటక సిటీ, ఆరోగ్య సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్స్ సిటీ, రవాణా సిటీ అంటూ నవ నగరాలు నిర్మిస్తామంటూ అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం శోచనీయం అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement