ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
-ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్
ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమాన ప్రయాణికుడికి ప్రయాణంలో ఉండగానే గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అవసరం కావటంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెలైట్ ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికుడిని దగ్గరల్లోని అపొలో ఆస్పత్రికి తరలించారు.