సచివాలయం వద్ద ప్రమాదం | accident at telangana secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయం వద్ద ప్రమాదం

Feb 10 2018 11:36 AM | Updated on Apr 3 2019 8:03 PM

 accident at telangana secretariat - Sakshi

తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు.  సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌ హోల్‌లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో సదరు వ్యక్తికి స్వల్పగాయలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. రోడ్లపై గుంతలు తవ్వి  రక్షణ లేకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement