ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.
హైదరాబాద్: ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 65 మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ జిల్లాలో 22 మంది, ఖమ్మం జిల్లాలో 10 మంది, మెదక్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, మహబూబ్‌నగర్ జిల్లాలో 11 మంది, నిజామాబాద్ , రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వడదెబ్బతో మృతి చెందారు.