జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 3,83,530 మంది ఓటర్లుగా నమోదయ్యారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 3,83,530 మంది ఓటర్లుగా నమోదయ్యారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 70,67,934 మంది ఓటర్లుండగా, కొత్త ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 74,51,464కు చేరుకుందని చెప్పారు. పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులను సరిగ్గా లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.