17న దుండిగల్‌లో వైమానిక ప్రదర్శన | 17 Air show in dundigal | Sakshi
Sakshi News home page

17న దుండిగల్‌లో వైమానిక ప్రదర్శన

Nov 16 2016 4:03 AM | Updated on Sep 4 2017 8:10 PM

17న దుండిగల్‌లో వైమానిక ప్రదర్శన

17న దుండిగల్‌లో వైమానిక ప్రదర్శన

బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెడ్ ఆరోస్ బృందం, భారత వాయుసేన బృందంతో కలిసి ఈ నెల 17న దుండిగల్ ఎరుుర్‌ఫోర్స్ అకాడమీలో వైమానిక ప్రదర్శన నిర్వహించనుంది.

భారత వాయుసేన, రెడ్ ఆరోస్ సంయుక్త నిర్వహణ

 సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెడ్ ఆరోస్ బృందం, భారత వాయుసేన బృందంతో కలిసి ఈ నెల 17న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వైమానిక ప్రదర్శన నిర్వహించనుంది. ఈ విషయాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రు మైక్ అలిస్టర్ వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంయుక్త వైమానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ సిటీల నిర్మాణం, రక్షణ రంగాల్లో భారత దేశంతో భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 52 ఏళ్లుగా రెడ్ ఆరోస్ బృందం 4700 వైమానికి ప్రదర్శనలు ఇచ్చిందని అలిస్టర్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement