పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి | 1 killed due to twe groups fight | Sakshi
Sakshi News home page

పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి

Oct 25 2016 11:09 AM | Updated on Sep 4 2017 6:17 PM

పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది.

హైదరాబాద్: పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది. బొల్లారం బొమ్మనకుంటలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడారు. ఈ సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి(40) అక్కడికక్కడే చనిపోయాడు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి మంగళవారం ఉదయం బొల్లారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement