'కేసులకు మేం భయపడం' | YSRCP MP mithun reddy slams cm babu on krishna bus accident | Sakshi
Sakshi News home page

'కేసులకు మేం భయపడం'

Mar 2 2017 9:43 AM | Updated on Jul 28 2018 3:39 PM

'కేసులకు మేం భయపడం' - Sakshi

'కేసులకు మేం భయపడం'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం ఫైర్‌ అయ్యారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం ఫైర్‌ అయ్యారు. బస్సు ప్రమాదంపై బాబు సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దోషులను తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్ష నేత ప్రశించడం తప్పా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు వైఎస్సార్సీపీ భయపడదని చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.
Advertisement
 
Advertisement
Advertisement