బొగ్గు టిప్పర్, బైక్ ఢీ: ఇద్దరు యువకుల దుర్మరణం | two youth died in mishap in khammam district | Sakshi
Sakshi News home page

బొగ్గు టిప్పర్, బైక్ ఢీ: ఇద్దరు యువకుల దుర్మరణం

Oct 30 2015 11:26 PM | Updated on Aug 25 2018 5:29 PM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్, బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామానికి చెందిన జొన్నల శ్రీను(17), చాట్ల రాంబాబు(24) మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన శివకృష్ణను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement