'సతీసావిత్రికి-చింతామణికీ ఉన్నంత తేడా' | TulasiReddy criticized Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'సతీసావిత్రికి-చింతామణికీ ఉన్నంత తేడా'

Feb 24 2016 1:01 PM | Updated on Sep 3 2017 6:20 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి .. ఎన్టీఆర్ కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి .. ఎన్టీఆర్ కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లె లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ శాసన సభ్యులుగా గెలిచిన రత్తయ్య, నారాయణ, ఆదయ్యలు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే.. ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.


ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలసలను ప్రోత్సహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిరంతరం ఎన్టీఆర్ పేరును దొంగ జపం చేసే టీడీపీ నాయకులు పార్టీఫిరాయింపుల విషయంలో సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించి టీడీపీలోకి చేర్చుకున్నట్లైతే బాబు రాజనీతిజ్ఞుడు అవుతాడని లేకదంటే... చరిత్ర హీనుడవుతాడని అన్నారు. పార్టీఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement