వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం | student kidnaped in vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం

Sep 30 2015 9:17 AM | Updated on Sep 3 2017 10:15 AM

నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది.

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న విద్యార్థి చందూని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడ చందూ పై దాడి చేసి చితక బాదారు. చందూ కిడ్నాప్ కు గురైనట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు సకాలంలో చందూ ఆచూకీ కనిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో తీవ్రగాయాలపాలైన చందూను హాస్పటిల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో చందూ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement