కొడుకుతో కలిసి భర్తకు నిప్పు పెట్టింది... | Son set fire to his Father | Sakshi
Sakshi News home page

కొడుకుతో కలిసి భర్తకు నిప్పు పెట్టింది...

Feb 11 2016 12:12 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రాములు(60) అనే వృద్ధుడిపై అతని భార్య సావిత్రమ్మ, కుమారుడు ఆంజేయులు కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సావిత్రమ్మను, ఆంజనేయులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  కాగా.. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement