ఆస్తి కోసం తల్లిని నరికిన కొడుకు | son chops his mother for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తల్లిని నరికిన కొడుకు

Oct 16 2015 10:24 AM | Updated on Sep 2 2018 4:37 PM

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. కన్న కొడుకు తల్లిని అత్యంత దారుణంగా నరికిన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

వరంగల్ :  వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. కన్న కొడుకు తల్లిని అత్యంత దారుణంగా నరికిన ఘటన కలకలం రేపింది.
 
తాటికాయల గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి తన తల్లిని గొడ్డలితో నరికాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సునీల్ పౌరోహిత్యం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. తల్లి పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని తన పేరు మీద రాయలేదన్న కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

దీనిపై  ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో పురోహితుడు సునీల్ ఒక్కడే కావడంతో గ్రామస్తులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. నిందితుడు సునీల్ పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement