బైక్ను ఢీకొన్న బస్సు : భర్త మృతి, భార్యకు గాయాలు | Road accident in kurnool district | Sakshi
Sakshi News home page

బైక్ను ఢీకొన్న బస్సు : భర్త మృతి, భార్యకు గాయాలు

Nov 26 2015 6:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం వద్ద గురువారం బైక్పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

కర్నూలు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం వద్ద గురువారం బైక్పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా... అతడి భార్య తీవ్రంగా గాయపడ్డింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement