పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య | lady suicide for marriage in adilabad | Sakshi
Sakshi News home page

పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

Nov 2 2015 6:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

ఆదిలాబాద్: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జైనూర్ మండలం గూసిమెట్ట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గురువ మంజుల (22) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

గత కొంతకాలంగా పెళ్లి కావటం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో మంజుల పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement