ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఇంజినీర్ | irrigation department executive engineer caught red hand by acb | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఇంజినీర్

Dec 22 2015 2:16 PM | Updated on Aug 17 2018 12:56 PM

బిల్లు పాస్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి మామూళ్లు తీసుకుంటున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతి: బిల్లు పాస్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి మామూళ్లు తీసుకుంటున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎర్రవాడపాలెంకు చెందిన గిరిబాబు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో మురళీ మోహన్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఇరిగేషన్‌ శాఖలో జరిగిన ఓ పనికి బిల్లు పాస్ చేయాల్సిందిగా ఇంజినీర్ గిరిబాబును కాంట్రాక్టర్ కోరారు.

అందుకు పెద్ద మొత్తంలో డబ్బలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే ఏ పనులు రాకుండా చేస్తానని బెదిరించాడు. చేసేది ఏమీ లేక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి మ్యూజిక్ రోడ్డులో కాంట్రాక్టర్ నుంచి ఇంజినీర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement