శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్ | high alert in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్

Jan 2 2016 9:22 AM | Updated on Aug 11 2018 8:07 PM

పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.  ఈ సందర్భంగా ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.  కాగా ఉన్నతాధికారులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్‌ను ప్రకటించారు.
 
పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement