కుక్కర్ లో వేడి చేస్తే మెరుగవుతాయని.. | gold robbery in ysr distirict | Sakshi
Sakshi News home page

కుక్కర్ లో వేడి చేస్తే మెరుగవుతాయని..

Aug 3 2015 1:43 PM | Updated on Aug 30 2018 5:27 PM

నగలకు మెరుగుపెడతామని చెప్పి ఒక మహిళను మోసం చేసి 12 తులాల బంగారు ఆభరణాలతో ఇద్దరు దుండగులు ఉడాయించారు.

చెన్నూరు(వైఎస్సార్ జిల్లా): నగలకు మెరుగుపెడతామని చెప్పి ఒక మహిళను మోసం చేసి 12 తులాల బంగారు ఆభరణాలతో ఇద్దరు దుండగులు ఉడాయించారు. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని రెడ్డి వారి వీధిలో జరిగింది. వివరాలు.. రెడ్డివారివీధికి చెందిన లక్షమ్మ ఇంటికి ఇద్దరు వ్యక్తులు నగలకు మెరుగుపెడతామని వచ్చారు. దీంతో లక్షమ్మ తన వద్ద ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. కాగా, ఈ ఆభరణాలకు రసాయనాలు వేశాం కుక్కర్‌లో వేడి చేస్తే మెరుగవుతాయని చెప్పి వెళ్లిపోయారు. మహిళ వారు చెప్పినట్లుగానే వేడి చేసి చూడగా కుక్కర్‌లో నగలు కనిపించకపోవడంతో లభోదిబోమంది.  మోసం పోయానని గ్రహించిన లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement