శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోమవారం దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి
Jan 23 2017 8:19 PM | Updated on Sep 5 2017 1:55 AM
చిత్తూరు: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీల అనుమతితోనే ప్రత్యేక హోదా అంశం కేబినెట్‌లో ప్రవేశపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ప్రణాళికపరంగా పోరాటం చేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Advertisement
Advertisement