'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు' | congress mla sudheer reddy slams trs | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు'

Dec 15 2015 1:37 PM | Updated on Mar 18 2019 8:57 PM

టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు.  మంత్రి కేటీఆర్ ప్రాధాన్యతను చూసి మరో మంత్రి హరీష్ రావు ఆందోళనకు గురవుతున్నారని  సుధీర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో తన ఉనికి కాపాడుకునేందుకు హరీష్ రావు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉడుకుతున్నాయని, అవి ఎప్పుడైనా పేలొచ్చని ఏద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 డివిజన్లను గెలుచుకుంటుందని సుధీర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement