తిరుమలలో ఆళ్వార్ తిరుమంజనం | alwar thirumanjanam in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఆళ్వార్ తిరుమంజనం

Dec 14 2015 10:42 AM | Updated on Sep 3 2017 1:59 PM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనుంది.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21 న వైకుంఠ ఏకాదశిరి పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేసి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం,  పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

Advertisement
 
Advertisement
Advertisement