నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో దుస్తులు ఉతుకుతున్న మహిళ కు షాక్ తగిలింది. ఇది గమనించిన ఆమె కొడుకు తల్లి ప్రాణాలు రక్షంచబోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.