క్షణక్షణముల్‌... చంద్రబాబు చిత్తముల్‌ 

Devulapalli Amar Article On Chandrababu Naidu Defaming EC - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు ఈ దేశానికీ పెద్ద నష్టం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా.

బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ ఎన్నికలప్పుడూ చూడని వింతలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు పట్ల కొన్ని రాజకీయ పక్షాలు ధీమాగా ఉంటాయి. కొన్ని పార్టీలకు గెలుస్తామో లేదో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉంటారు. ఓటమి ఖాయం అని కొన్ని పార్టీలకు ముందే తెలిసి పోతుంది. ఈ అన్ని కోవలకు చెందిన పార్టీలు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వెలువడే వరకూ తమకు తోచిన లెక్కలు వేసుకుని జయాపజయాలను గురించిన ఒక అంచనాకు రావడం సహజంగా జరిగే పని. గెలుపు పట్ల ధీమా ఉన్నవాళ్ళు లేదా గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చేశాం అనుకునే వాళ్ళు ఫలితాలు వెలువడే వరకూ ప్రశాంతంగా గడిపేస్తారు. ఎన్నికల సమయంలో పడ్డ శ్రమను మరిచిపోడానికి విశ్రాంతి తీసుకుంటారు. ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అక్రమాలకూ పాల్పడిందనీ ఫిర్యాదు చేస్తారు. అధికార పక్షం చాలా ధీమాగా ఉంటుంది. ఫలితాలు వెలువడిన తరువాత ఓడిపోయినా పార్టీలు కారణాలను విశ్లేషించుకోవడం సహజం. వీలయితే తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ అయిదేళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి ఏం చెయ్యాలో ఆలోచించి ఆ ప్రకారం నడుచుకోవడం కూడా సహజం.

ఈసీపై బాబు విమర్శ వింతల్లోకెల్లా వింత
ఓటమికి కారణాలను వెతుక్కోవడం, విశ్లేషించుకోవడం అంటే తమ వల్ల జరిగిన తప్పులను గుర్తించడం, మళ్ళీ ఆ తప్పులు జరక్కుండా చూసుకోవడం. మొదట్లోనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అట్లా కాకుండా ఒక వింత పరిస్థితి నెలకొని ఉన్నది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నానో, ప్రతిపక్షంలో ఉన్నానో అర్థం కాని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్న తీరు ఈ వింత పరిస్థితికి దారి తీసింది. 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంతకు ఒక రోజు ముందు నుండే ఆయన ఈ ఎన్నికలు జరిగిన తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడం, అక్రమాలు జరగబోతున్నాయని వాపోవడం, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మొదలు పెట్టారు. తన పోలీసులనే తనను అరెస్ట్‌ చెయ్యమని ప్రేరేపించడం పరాకాష్ట. ఇన్నీ చేసి పోలింగ్‌ రోజున మళ్ళీ పొద్దున్నే బుద్ధిమంతుడిలా బూత్‌కు వెళ్లి ఓటు వేసి బయటికొచ్చి భార్యా బిడ్డలతో కలిసి వేలి మీద సిరా గుర్తు చూపించి ఇంటికి వెళ్ళారు. అట్లా వెళ్ళిన గంట తరువాత గోల మొదలు పెట్టారు ఈవీఎంలు మొరాయించాయనీ, తప్పులు చేస్తున్నాయనీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఓట్లు మారుతున్నాయనీ. అసలు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణే తప్పు.. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరగాలనీ ఉపన్యాసం మొదలుపెట్టారు.

ఆయన ఇట్లా ఉపన్యసిస్తున్న సమయంలోనే ఆయన ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన పెద్దమనిషి కోడెల శివప్రసాద్‌ ఒక బూత్‌లో దూరి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌ మొదలుపెట్టి జనం చేత బయటికి ఈడ్పించేసుకున్నాడు. 1994లో తాను భాగస్వామిగా ఉన్న టీడీపీ.. 1999, 2014లో తను అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఎన్నికలలో గెలిచినప్పుడు ఇవే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన విషయం ఆయన మరిచిపోతున్నారు. పోనీ అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి ఇప్పుడు చెయ్యడం లేదు, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేసింది ఇప్పుడు చెయ్యడం లేదు అనుకుంటే గత అయిదేళ్లుగా ఎందుకు ఒక్క మాటా మాట్లాడలేదు? మొన్నటికి మొన్న నంద్యాల శాసన సభ ఉపఎన్నికల సందర్భంలో ఎందుకు మాకు ఈవీఎంలు వద్దు, ఈ ఎన్నికల సంఘం వద్దు అనలేదు. ఇప్పుడు తన కొత్త మిత్రులు కాంగ్రెస్‌ వారు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?

గెలుపుపై ధీమా.. తోడుగా చిత్తచాంచల్యం
ఇప్పుడెందుకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ కప్పెక్కి ఈవీఎంలనూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు? ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఆయనకు ముందే తెలిసి పోయింది. అధికారం కోల్పోబోతున్నామని అర్థం అయింది. అందుకే పొంతన లేని మాటలు మొదలు పెట్టారు. కాసేపు నా ఓటు నా పార్టీకి పడిందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు, మళ్ళీ వెంటనే తన పార్టీకి 150 స్థానాలు లభిస్తాయని మాట్లాడతారు. గెలుపు మీద ధీమా ఉన్న వాళ్ళెవ్వరూ ఇట్లా చిత్త చాంచల్యం ప్రదర్శించరు. ‘‘స్టేట్స్‌మన్‌‘‘ అయితే ఓటమిని కూడా ధైర్యంగా స్వీకరిస్తారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబునాయుడు ఎంత సేపూ ఆత్మస్తుతి పరనిందతోనే గడిపేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా అట్లానే గడిచింది. ఈ చివరి అంకంలో ఆయన మారతారని ఎట్లా అనుకుంటాం.

ఎన్నికలు అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉన్నాయి. మే 23వరకూ ఆగితే ఫలితం తెలిసి పోతుంది. ఇప్పుడు ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా పరిస్థితి మారదు, మళ్ళీ ఎన్నికలు జరగవు. మరెందుకు చంద్రబాబు ఇంత గోల చేస్తున్నట్టు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళయినా పూర్తి కాని ఒక యువ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ఒంటరి పోరాటంలో తాను మట్టికరవబోతున్నానన్న ఆలోచనే ఆయనకు మింగుడు పడటం లేదు. సీనియర్‌ రాజకీయవేత్తగా విలువల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తాను యువ నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. 

నిజాయితీ నా సొంతం, నేను నిప్పును అని చెప్పుకునే ఆయన ప్రజాప్రతినిధులను కొంటుంటే, జగన్‌ తన పార్టీలో చేరే వాళ్ళు పదవులకు రాజీనామా చెయ్యాలని నిబంధన విధించి కొన్ని విలువలను ప్రతిష్టించాడు. ఈ అయిదేళ్ళలో జగన్‌మోహన్‌ రెడ్డికి పెరిగిన ప్రజాదరణ, ముఖ్యంగా 14 మాసాలపాటు ఆయన చేసిన పాదయాత్రను జనం ఆదరించిన తీరు చంద్రబాబునాయుడును గంగవెర్రులు ఎత్తిస్తున్నది. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటించకపోగా వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు తన ఓటమికి ఎన్నికల సంఘం అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా. 

ఓటమి ముంగిట్లోనూ డబ్బు చేసుకోవడమే!
అంతే కాదు, ఫలితాలు వెలువడే దాకా ఈ నలభై రోజులు బీజేపీ వ్యతిరేక శిబిరంలో తానే చక్రం తిప్పుతున్నాననే భ్రమలో ఉండి, ఇతరులను కూడా ఉంచి మకాం ఢిల్లీకి మార్చాలనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు. కానీ వాతావరణం చూస్తే అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా ఆయన పార్టీ గెలవగల స్థానం ఒక్కటి కూడా గట్టిగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలు లేకుండా ఢిల్లీలో ఆయనను పిలిచి పీట వేసే వాళ్ళు ఎవరూ ఉండరన్న విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలూ ఇంకా 150 స్థానాలు మావే అని చెప్పుకుని తిరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మళ్ళీ ఆయనే వస్తాడేమో అనే భయంతో డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వసూలు చేసుకోవడం (ఇది జరుగుతున్నది అనడానికి నిదర్శనం నిన్న మొన్న ముఖ్యమంత్రి అధికార నివాసం ఫోన్‌ నుంచి వ్యాపారులను డబ్బు ఇవ్వాలని పీడిస్తూ వెళ్ళిన ఫోన్‌ కాల్స్, ఆ వ్యాపారులు చేసిన పోలీసు కంప్లైంట్స్‌). 

రెండో కారణం ఓడిపోతున్నామని తెలిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా ఎవరూ పిలవరేమో అన్న దుగ్ధ కావొచ్చు. ఏది ఏమయినా రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు నాయుడు ఈ దేశానికీ పెద్ద నష్టం అయితే చెయ్యడానికి సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య పండుగగా అందరం కీర్తించే ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పట్ల ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. అభినవ గోబెల్‌ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. ఏది ఏమయినా వచ్చే నలభై రోజులు అమరావతిలోని ఉండవల్లి వేదిక బీట్‌ చూస్తున్న విలేకరులకు మాత్రం రోజూ కొన్ని గంటలు చంద్రబాబు పత్రికాగోష్టి పేరిట ఇచ్చే ఉపన్యాసాల ఘోష భరించక తప్పదు.


-దేవులపల్లి అమర్‌

datelinehyderabad@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-07-2019
Jul 04, 2019, 14:21 IST
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది....
09-06-2019
Jun 09, 2019, 05:00 IST
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే...
09-06-2019
Jun 09, 2019, 04:52 IST
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే...
08-06-2019
Jun 08, 2019, 08:12 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు....
08-06-2019
Jun 08, 2019, 04:07 IST
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ...
06-06-2019
Jun 06, 2019, 19:56 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది....
06-06-2019
Jun 06, 2019, 19:54 IST
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ...
06-06-2019
Jun 06, 2019, 16:53 IST
చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా...
06-06-2019
Jun 06, 2019, 15:31 IST
ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.
06-06-2019
Jun 06, 2019, 14:02 IST
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఘట్‌బంధన్‌ విఫలమై విడిపోవడానికి...
06-06-2019
Jun 06, 2019, 10:41 IST
స్థానిక నాయకుల వల్లే కుప్పంలో తగ్గిన మెజారిటీ
06-06-2019
Jun 06, 2019, 08:25 IST
 చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ...
05-06-2019
Jun 05, 2019, 17:31 IST
తెలుగు దేశం పార్టీలో లోక్‌సభ పదవుల పందేరం చిచ్చు రేపింది.
05-06-2019
Jun 05, 2019, 15:34 IST
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన...
05-06-2019
Jun 05, 2019, 13:14 IST
రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
05-06-2019
Jun 05, 2019, 11:45 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే...
05-06-2019
Jun 05, 2019, 09:03 IST
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ...
05-06-2019
Jun 05, 2019, 08:29 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ...
05-06-2019
Jun 05, 2019, 07:52 IST
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న...
04-06-2019
Jun 04, 2019, 20:13 IST
సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top