టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)


పనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపుకోసం మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సూచనలకు తగ్గట్టు మీ సిబ్బంది పని చేస్తారు. ఉద్యోగార్థుల ఎదురు చూపులు ఫలిస్తాయి. వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శక్తి సామర్థ్యాలను మెరుగు పరచుకుంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కలిసొచ్చే రంగు: తెలుపు



వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

మనం చకచకా ముందుకెళ్లాలంటే ముందు మన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవాలని గ్రహించండి. మీ నిర్ణయాత్మక శక్తి ఇతరులు ప్రశ్నించేలా ఉండకూడదు. ఎదుటివాళ్ల బాహ్యవేషాలను బట్టి అంచనాలు వేసుకోకండి. మీకు అనుమానంగా ఉన్నవాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోండి. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.

కలిసొచ్చే రంగు: గోధుమ రంగు



మిథునం (మే 21 – జూన్‌ 20)

ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ సన్నిహితులొకరు వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా, మీకు దూరంగా మెలగుతున్నట్లుగా అనిపించవచ్చు. వారిని ప్రశ్నించేముందు వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూడండి. ఆర్థికంగా బాగుంటుంది. నిద్రలేమి చికాకు పరచవచ్చు. చిన్న చిన్న రుగ్మతలకు గృహ చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది.

కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ



కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

ఈ వారం మీరు బోలెడన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. ఒక వ్యక్తితో అనుకోకుండా జరిగిన పరిచయం బలపడుతుంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సన్నిహితులొకరితో మీకు వివాదం ఏర్పడవచ్చు. అది ఒత్తిడి మూలంగా జరిగినదే కాని, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరంగా కుంగిపోవద్దు.

కలిసొచ్చే రంగు: ఎరుపు



సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

ఒకదారి మూసుకుపోతే వంద దారులు ఉంటాయని గుర్తు చేసుకోండి. చాలాకాలంగా ఉన్న ఒక బంధం బలహీన పడవచ్చు లేదా తెగిపోవచ్చు. అది మీరూహించిందేగా, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. గత పరిణామాల నుంచి పాఠాలను నేర్చుకోండి. ఆసక్తికరమైన ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు లేదా మీరు కొత్త ప్రదేశాలకు ఆహ్వానం అందుతుంది. వర్తమానంలో జీవించండి.

కలిసొచ్చే రంగు: గోధుమ



కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

సానుకూల భావనలు, ఉత్సాహకర వాతావరణం నడుమ ఉల్లాసంగా ఉంటారు. ప్రకృతి ఎన్నో అందాలను, వింతలు, విడ్డూరాలను ప్రసాదించింది కదా, హాయిగా అనుభవించండి, ఆనందించండి. మీ ఆధ్యాత్మిక మార్గం లేదా బోధలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. వివిధ రకాల రుగ్మతలకు మీకు మీరు చికిత్స చేసుకోవడమే గాక ఇతరులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపశమనం కలిగిస్తారు.

కలిసొచ్చే రంగు: పసుపు



తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

మీ మనస్సును, మెదడును పనికి సన్నద్ధం చేయండి. నిదానమే ప్రధానం అన్న సూక్తిని ప్రస్తుతానికి పక్కనపెట్టి ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని అనుసరించి పని చేయండి. మీ కుటుంబంతో, ముఖ్యంగా సహోద్యోగులతో పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల్లో అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త.

కలిసొచ్చే రంగు: గులాబీ



వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

మబ్బులు కమ్మిన ఆకాశంలోనే సూర్యోదయం కూడా జరుగుతుందని గుర్తు తెచ్చుకోండి. పాత వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రశాంతంగా, స్థిమితంగా, తేటపడిన మనస్సుతో ఉంటారు. పిల్లల మూలంగా ఆనందం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం.

కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ



ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

కాలానుగుణంగా జరుగుతున్న మార్పులను ఆమోదించక తప్పదని గుర్తించండి. మీ కోణంలో నుంచే కాదు, ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం మంచిది. బూజుపట్టుకుపోయిన పాత అలవాట్లను వదులుకోకపోతే ఇబ్బందులు తప్పదు. మీకొక అవకాశం వస్తుంది. అయితే అది కొద్దిపాటి రిస్క్‌తో కూడుకున్నందువల్ల ఎటూ తేల్చుకోలేకపోతారు. పనితో అలసిన మనస్సును, శరీరాన్ని సేదతీర్చడం అవసరం.

కలిసొచ్చే రంగు: వంకాయ రంగు



మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంటుందీ వారమంతా! పనులలో జాప్యం. శుష్కవాగ్దానాలకు బోల్తా పడవద్దు. మీలాగే అందరూ నిజాయితీపరులని అనుకోవద్దు. ముద్రణ, యంత్రాలతో పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పనిని సమీక్షించుకుని, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడం మంచిది. విందువినోదాలలో గడుపుతారు.

కలిసొచ్చే రంగు: ఊదా



కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)

కష్టాలు వచ్చినప్పుడే మనకు కావలసిన వారెవరో తెలిసొస్తుంది. అంతేకాదు, మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు వెలికి వస్తాయని గుర్తించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పదు. పనిప్రదేశంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. పాతశత్రువుల పట్ల అప్రమత్తత,  ఇరుగు పొరుగుతో సఖ్యత అవసరం.

కలిసొచ్చే రంగు: నారింజ



మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

మీ ఆశయాల సాధనకు తగిన కృషి, ప్రణాళికతో కార్యాచరణలోకి దిగండి. మీకేదైనా కొత్త ఆలోచన వచ్చినా, సృజనాత్మకత చూపించాలనుకున్నా, మీలోనే ఉంచుకోండి. బయటికి చెప్పవద్దు. వెంటనే అమలు చేసేయండి. ఒక బంధం విషయంలో నిజానిజాలు తెలుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఒక ఆకర్షణ బంధంగా మారేంతగా బలపడవచ్చు.

కలిసొచ్చే రంగు: బూడిద రంగు

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top