చవకగా అందించేందుకు త్వరలో అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ
ఇందిరమ్మ రెండో విడతలో కూడా సొంత జాగా ఉన్నవారే పరిగణనలోకి..
వచ్చే మార్చి నాటికి లక్ష ఇళ్ల గృహప్రవేశాలు... త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజల కోసం చవకగా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. లాభనష్టాల యోచనకు అతీతంగా ప్రభుత్వం దీన్ని చేపట్టనుందన్నారు. ఇందుకోసం అఫర్డ్‌బుల్ (సరసమైన) హౌసింగ్ పాలసీని రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఔటర్ రింగు రోడ్డుకు నాలుగు వైపులా నాలుగు స్థలాలను గుర్తించామని, ఒక్కోచోట 8 వేల నుంచి 10 వేల వరకు ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో గృహనిర్మాణ శాఖ రెండేళ్ల ప్రగతిపై ఆయన విలేకరులతో మాట్లాడారు.
లీజులు చెల్లించని భూముల స్వా«దీనం: ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేపీహెచ్‌బీలో నిర్మించిన హౌసింగ్ బోర్డు ఇళ్లల్లో శిథిలావస్థకు చేరుకున్నవాటిని గుర్తించి వాటిని తొలగించి ఆయా స్థలాల్లో హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2 బీహెచ్‌కే ఇళ్లను రూ.700 కోట్లు వెచి్చంచి పూర్తి చేస్తున్నాం. మరో రూ.200 కోట్లతో ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. లీజులు చెల్లించని, కబ్జా అయిన హౌసింగ్ బోర్డు భూములను స్వా«దీనం చేసుకుంటున్నాం. ఇప్పటికే వెయ్యి ఎకరాల భూమికి ప్రహరీ గోడలు నిర్మించాం. ఇప్పటివరకు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, 3 లక్షల ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి. జూన్ నాటికి మరో 2 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలుంటాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గ్లోబల్ సమ్మిట్‌లో కూడా చర్చించనున్నాం..’అని మంత్రి తెలిపారు.
సొంతజాగా లేని వారికి మూడో విడతలో..
‘ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లంచమడిగిన 9 మంది గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. మరో ఇద్దరిని సరీ్వసు నుంచి తొలగించాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జ్యోతి పథకం పేరుతో ఇళ్ల నిర్మాణానికి మంజూరీలు ఇచ్చిన వాటితోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరు పొంది అసంపూర్తిగా నిర్మాణాలను వదిలేసిన దాదాపు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నాం. ఈ పథకానికి సంబంధించి రెండో విడతలో కూడా సొంత జాగా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటాం. సొంతజాగా లేని వారికి మూడో విడతలో మంజూరు చేస్తాం. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ 4 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించబోతున్నాం..’పొంగులేటి చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో భూముల కన్వర్షన్
‘గతంలో పారిశ్రామిక భూములను నివాస ప్రాంత భూములుగా మార్చిన విషయాన్ని, అస్మదీయులకు కట్టబెట్టిన విషయాన్ని కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు మరిచిపోయి, ఇప్పుడు హిల్ట్ పాలసీపై విమర్శలు చేస్తున్నారు. ఓఆర్‌ఆర్ నిర్వహణను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి కేసీఆర్, కేటీఆర్‌లు కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్ట్ చేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారు. గతంలో ఎల్‌బీనగర్‌లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వగా, భూగర్భ జలాలు కలుíÙతమయ్యాయని ప్రజలు ఆందోళన జరిపారు. ఈ పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది బీఆర్‌ఎస్ కాదా? ఈ ఫైలుపై తండ్రీ కొడుకులు సంతకాలు చేయలేదా? ఐడీపీఎల్‌లో కూడా ఇదే విధంగా చేశారు. హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే స్క్రిప్టుతో డ్రామాలాడుతున్నాయి..’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


