వెజ్ పోహా కట్‌లెట్ | Poha veg cutlet | Sakshi
Sakshi News home page

వెజ్ పోహా కట్‌లెట్

Apr 9 2016 11:11 PM | Updated on Aug 20 2018 7:27 PM

వెజ్ పోహా కట్‌లెట్ - Sakshi

వెజ్ పోహా కట్‌లెట్

అటుకులను 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటినంతా పిండేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేయాలి.

స్నాక్ సెంటర్

కావలసినవి:
అటుకులు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు - 2, నూనె - 1 కప్పు, జీలకర్ర - అర చెంచా, ఆవాలు - అర చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, మైదా పిండి - అర కప్పు, కారం - 1 చెంచా, పసుపు - పావు చెంచా, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, నిమ్మరసం - 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు - 2 చెంచాలు , ఉప్పు - తగినంత, చాట్ మసాలా - చిటికెడు
 
తయారీ: అటుకులను 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటినంతా పిండేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేయాలి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత మైదా పిండి, అటుకులు, చిదిమిన బంగాళదుంప, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని కట్‌లెట్స్‌లాగా చేసుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి, వీటిని బాగా కాల్చుకోవాలి. అవన్ ఉన్నవాళ్లు బేక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement