మచ్చలేని అందం! | Funday beauty tips 27-01-2019 | Sakshi
Sakshi News home page

మచ్చలేని అందం!

Jan 27 2019 12:45 AM | Updated on Jan 27 2019 12:45 AM

Funday beauty tips 27-01-2019 - Sakshi

మార్కెట్‌లో దొరికే ఫేస్‌ క్రీమ్స్‌ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : క్లీనప్‌ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్, కీరదోస జ్యూస్‌ – ఒకటిన్నర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్‌
 స్క్రబ్‌ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు
మాస్క్‌: క్యారెట్‌ గుజ్జు – 3 టీ స్పూన్లు, కిస్మిస్‌ గుజ్జు – 1 టీ స్పూన్, చిక్కటి పాలు – ఒకటిన్నర టీ స్పూన్‌
తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, గడ్డ పెరుగు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ గుజ్జు, కిస్మిస్‌ గుజ్జు, చిక్కటి పాలు బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement