సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ | sakshi rangoli competition for pongal season | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ

Jan 1 2014 7:26 PM | Updated on Aug 20 2018 8:31 PM

సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ - Sakshi

సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ

సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అచ్చమైన తెలుగు పడుచుల కోసం సాక్షి వెబ్సైట్ sakshi.com ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది.

సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అచ్చమైన తెలుగు పడుచులు రంగవల్లులు తీర్చిదిద్దడంలో మునిగి తేలుతుంటారు. తెల్లటి ముగ్గుల మీద రంగులద్ది, గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని బంతిపూలతో అలంకరిస్తారు. అలాంటి తెలుగింటి అతివలను ప్రోత్సహించేందుకు సాక్షి వెబ్సైట్ sakshi.com ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది.

ఉత్తమమైన 5 ముగ్గులకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తాం. తెల్ల కాగితంపై ముగ్గు వేసి, దాన్ని స్కాన్ చేసి మాకు ఈనెల 11వ తేదీ లోగా మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడీ.. sakshidaily@gmail.com సకాలంలో మాకు చేరినవాటిలోంచి మంచి ముగ్గులను ఎంపిక చేసి, బహుమతులు ఇస్తాం. ఇప్పటివరకు పంపిన కొన్ని ఫొటోలను ఇప్పటికే sakshi.comలో గ్యాలరీగా పెట్టాం. అవి చూడాలంటే.. http://www.sakshi.com/photos/events/album-readers-rangoli-for-pongal-season-149 లింకును క్లిక్ చేయండి.

నిబంధనలు:
1. మీకు నచ్చిన ఏ అంశంపైనైనా ముగ్గు వేసి పంపవచ్చు.
2. తెల్ల కాగితంపై మాత్రమే ముగ్గులు వేసి స్కాన్ చేసి పంపాలి.
3. ముగ్గు కింద ఆ ముగ్గు వేసిన వారి పూర్తి వివరాలు పేరు, ఊరు, అడ్రస్, సెల్ నెంబర్ ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement