breaking news
rangoli competition
-
‘పవన్.. అంబటి రాంబాబును ఫాలో అవుతున్నారు’
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు.. ఆయననే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారని తెలిపారు.గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ నేతలు అన్నబత్తుని శివ కుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకట రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీల్లో గీతాంజలి లక్ష రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనుక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్ జగన్‌కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా?మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే మొదట గుర్తు వచ్చేది ముగ్గుల పోటీలు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు. గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారు. వాళ్లే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారు. అందరి ఆత్మీయుడు అంబటి రాంబాబు.వైఎస్ జగన్‌ను ఎవరు విమర్శిస్తే వారికి.. అంబటి రాంబాబు తన మాటల చురకులతో తాట తీస్తారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, చేయూత, రైతు భరోసా లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘సంక్రాంతి అంటే సాంప్రదాయం. ఆటలు, పాటలు, కోడిపందాలు ఎన్నో ఉంటాయి. ప్రతీ సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన్ను కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకి వెళ్ళాడు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. -
రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)
-
న్యూ ఇయర్ వేళ..రారండోయ్ ముగ్గులు వేద్దాం..!
-
సాక్షి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో ముగ్గుల పోటీలు
-
సాక్షిమీడియా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
-
‘సాక్షి’ తెచ్చిన సంక్రాంతి సందడి
-
కంగ్రాట్స్
ముగ్గుల పోటీలో విజేతకు మిక్సీ అందిస్తున్న దృశ్యం ఇది..ఇందులో విశేషమేముందంటారా.. బహుమతి ఇచ్చే వ్యక్తిని బాగా చూడండి.. గుర్తు పట్టలేదా.. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్.. వీరబ్రహ్మంగారిని దర్శించునేందుకు ఆదివారం బి.మఠం వచ్చినప్పుడు నిర్వాహకులు ఇలా ఆయన చేత బహుమతులు ఇప్పించారు. -న్యూస్‌లైన్, బి.మఠం -
నేడు ముగ్గుల పోటీలు
చంద్రశేఖర్ కాలనీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో శనివారం సాక్షి ఆధ్వర్యంలో సాయిరాం హోండా సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. పోటీల్లో పాల్గొనే మహిళలు ఉదయం 9 గంటలకు మైదానానికి చేరుకోవాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘సాక్షి’ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు, బాలికలు పెద్దఎత్తున పాల్గొని, ప్రతిభను కనబరిచి బహుమతులు పొందాలని సాయిరాం హోండా షోరూం సీఈఓ నల్లా స్రవంతి దినేశ్‌రెడ్డి కోరారు. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలని, ముగ్గు, రంగులను మహిళలే తెచ్చుకోవాలని సూచించారు. విజేతలకు బహుమతులు ప్రథమ బహుమతి కింద మైక్రోవేవ్ ఓవెన్, ద్వితీయ బహుమతిగా 5 జార్స్ మిక్సీ, తృతీయ బహుమతిగా ఎలక్ట్రిక్ కుక్కర్‌తో పాటు ఐదు కన్సోలేషన్ బహుమతులను అందజేస్తారు. పేరు రిజిస్ట్రేషన్ కోసం 99122 20708, 99122 20716 నెంబర్లలో సంప్రదించాలి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మంగతాయారు రానున్నారు. న్యాయనిర్ణేతలుగా జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిపూర్ణ మహేందర్‌రెడ్డి, మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధరదేవి, సోనా సొసైటీ అధ్యక్షురాలు సుజాత వ్యవహరించనున్నారు. -
సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ
సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అచ్చమైన తెలుగు పడుచులు రంగవల్లులు తీర్చిదిద్దడంలో మునిగి తేలుతుంటారు. తెల్లటి ముగ్గుల మీద రంగులద్ది, గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని బంతిపూలతో అలంకరిస్తారు. అలాంటి తెలుగింటి అతివలను ప్రోత్సహించేందుకు సాక్షి వెబ్సైట్ sakshi.com ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది. ఉత్తమమైన 5 ముగ్గులకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తాం. తెల్ల కాగితంపై ముగ్గు వేసి, దాన్ని స్కాన్ చేసి మాకు ఈనెల 11వ తేదీ లోగా మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడీ.. sakshidaily@gmail.com సకాలంలో మాకు చేరినవాటిలోంచి మంచి ముగ్గులను ఎంపిక చేసి, బహుమతులు ఇస్తాం. ఇప్పటివరకు పంపిన కొన్ని ఫొటోలను ఇప్పటికే sakshi.comలో గ్యాలరీగా పెట్టాం. అవి చూడాలంటే.. http://www.sakshi.com/photos/events/album-readers-rangoli-for-pongal-season-149 లింకును క్లిక్ చేయండి. నిబంధనలు: 1. మీకు నచ్చిన ఏ అంశంపైనైనా ముగ్గు వేసి పంపవచ్చు. 2. తెల్ల కాగితంపై మాత్రమే ముగ్గులు వేసి స్కాన్ చేసి పంపాలి. 3. ముగ్గు కింద ఆ ముగ్గు వేసిన వారి పూర్తి వివరాలు పేరు, ఊరు, అడ్రస్, సెల్ నెంబర్ ఉండాలి.


