జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో శనివారం సాక్షి ఆధ్వర్యంలో సాయిరాం హోండా సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.
చంద్రశేఖర్ కాలనీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో శనివారం సాక్షి ఆధ్వర్యంలో సాయిరాం హోండా సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. పోటీల్లో పాల్గొనే మహిళలు ఉదయం 9 గంటలకు మైదానానికి చేరుకోవాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘సాక్షి’ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు, బాలికలు పెద్దఎత్తున పాల్గొని, ప్రతిభను కనబరిచి బహుమతులు పొందాలని సాయిరాం హోండా షోరూం సీఈఓ నల్లా స్రవంతి దినేశ్‌రెడ్డి కోరారు. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలని, ముగ్గు, రంగులను మహిళలే తెచ్చుకోవాలని సూచించారు.
విజేతలకు బహుమతులు
ప్రథమ బహుమతి కింద మైక్రోవేవ్ ఓవెన్, ద్వితీయ బహుమతిగా 5 జార్స్ మిక్సీ, తృతీయ బహుమతిగా ఎలక్ట్రిక్ కుక్కర్‌తో పాటు ఐదు కన్సోలేషన్ బహుమతులను అందజేస్తారు. పేరు రిజిస్ట్రేషన్ కోసం 99122 20708, 99122 20716 నెంబర్‌లలో సంప్రదించాలి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మంగతాయారు రానున్నారు. న్యాయనిర్ణేతలుగా జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిపూర్ణ మహేందర్‌రెడ్డి, మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధరదేవి, సోనా సొసైటీ అధ్యక్షురాలు సుజాత వ్యవహరించనున్నారు.