కబడ్డీ ఆడుతూ.. | The collapse of a student death of on the way to hospital | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఆడుతూ..

Jan 25 2015 12:04 AM | Updated on Sep 2 2017 8:12 PM

కబడ్డీ ఆడుతూ..

కబడ్డీ ఆడుతూ..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల రిహార్సల్స్‌లో

కుప్పకూలిన విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

బోడుప్పల్/మేడిపల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల రిహార్సల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. చెంగిచర్ల సాయినగర్‌కు చెందిన పి. సత్యనారాయణ ఇందిర దంపతులకు సాయిలీల(15), సాయికృష్ణ ఇద్దరు పిల్లలు. సాయిలీల చంగిచర్లలోని బీఎంఆర్‌ఎస్ స్కూల్‌లో 10 వతరగతి చదువుతోంది. శనివారం కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సాయిలీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ

 విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ ఎం. రవిచందన్‌రెడ్డి, మేడిపల్లి ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి, ఎస్‌ఐ ప్రేమ్‌సాగర్ సంఘటన స్థలానికి, కాకతీయ హాస్పిటల్‌కు వెళ్లి వివరాల సేకరించారు. సాయిలీల తల్లిదండ్రులను పరామర్శించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని వివరాలు తెలుస్తాయని ఏసీపీ వెల్లడించారు. బాలిక మృతిని తోటి విద్యార్థులు,కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement