breaking news
Sai Leela
-
డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్!
నగరంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక హోదా పాదయాత్రతో అలసిపోయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఆయన కుమార్తె సాయిలీల వచ్చి సెల్ఫీ డాడీ అనడంతో రిలాక్స్ అయ్యారు. ఫొటోకు పోజిచ్చారు. సాయిలీల ప్రస్తుతం హైదరాబాద్‌లో జర్నలిజం డిగ్రీ చేస్తోంది. దసరా సెలవులకు వచ్చిన ఆమె ఎర్రదండు ఉద్యమాల్లో నేను సైతం అంటూ పాల్గొంటోంది. - సాక్షి, విజయవాడ -
కబడ్డీ ఆడుతూ..
కుప్పకూలిన విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి బోడుప్పల్/మేడిపల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల రిహార్సల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. చెంగిచర్ల సాయినగర్‌కు చెందిన పి. సత్యనారాయణ ఇందిర దంపతులకు సాయిలీల(15), సాయికృష్ణ ఇద్దరు పిల్లలు. సాయిలీల చంగిచర్లలోని బీఎంఆర్‌ఎస్ స్కూల్లో 10 వతరగతి చదువుతోంది. శనివారం కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సాయిలీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ ఎం. రవిచందన్‌రెడ్డి, మేడిపల్లి ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి, ఎస్ఐ ప్రేమ్‌సాగర్ సంఘటన స్థలానికి, కాకతీయ హాస్పిటల్‌కు వెళ్లి వివరాల సేకరించారు. సాయిలీల తల్లిదండ్రులను పరామర్శించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని వివరాలు తెలుస్తాయని ఏసీపీ వెల్లడించారు. బాలిక మృతిని తోటి విద్యార్థులు,కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.