breaking news
Sports competition
-
Aadudam Andhra: క్రీడాకారుల కోసం రూ.41.43 కోట్ల విలువైన 5 లక్షల స్పోర్ట్స్ కిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల సందడి నెలకొంది. క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌తో పాటు క్రీడా పరికరాల పంపిణీ ఊపందుకుంది. సుమారు 50 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ అతిపెద్ద మెగా టోర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన దాదాపు 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లకు తరలించింది. డిసెంబర్ తొలివారం నాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కిట్లను అందించేలా ప్రత్యేక దృష్టి సారించింది. వీటితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విజేతలకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో టీషర్టు, టోపీని ఇవ్వనున్నారు. కిట్ల నాణ్యత పక్కాగా పరిశీలన.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి మూడు వాలీబాల్లు, నెట్, మూడు బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్స్, మూడు బేసిక్ క్రికెట్ కిట్లు, రెండు టెన్నీకాయిట్ రింగ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక నియోజకవర్గ పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు యాంక్లెట్స్, నీక్యాప్స్ అందిస్తోంది. మండల స్థాయిలో ఆరు వాలీబాల్లు, రెండు ప్రొఫెషనల్ క్రికెట్ కిట్లను సమకూరుస్తోంది. వీటితో పాటు 6 వేల ట్రోఫీలు, 84 వేల పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనుంది. క్రీడా పరికరాల తయారీలో మంచి పేరున్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించి స్పోర్ట్స్ కిట్లను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన అధికారులు, కోచ్‌లు స్వయంగా స్పోర్ట్స్ కిట్ల తయారీ పరిశ్రమలకు వెళ్లి వాటి నాణ్యతను పరిశీలించారు. ఆయా సంస్థలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సరఫరా చేసిన పరికరాలను ప్రత్యేక కమిటీ ద్వారా మరోసారి పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. వెలుగులోకి ప్రతిభావంతులు ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ప్రతి క్రీడాకారుడు పోటీల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వమే సమకూరుస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థలకు చేరిన కిట్లను మరోసారి పరిశీలించి క్షేత్రస్థాయికి వేగంగా పంపించేలా ఆదేశించాం. ఈ మెగా టోర్నీని ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ . ప్రత్యక్ష ప్రసారానికి సన్నాహాలు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే మ్యాచ్‌ల వివరాలు, స్కోర్‌ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనుంది. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 10 మంది చొప్పున వలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. నియోజకవర్గస్థాయి పోటీలను యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. -
గుంటూరులో ఉత్సాహంగా పోలీసుల క్రీడా పోటీలు
-
కరీంనగర్లో ఖేలో ఇండియా రెజ్లింగ్ పోటీలు
-
కబడ్డీ ఆడుతూ..
కుప్పకూలిన విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి బోడుప్పల్/మేడిపల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల రిహార్సల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. చెంగిచర్ల సాయినగర్‌కు చెందిన పి. సత్యనారాయణ ఇందిర దంపతులకు సాయిలీల(15), సాయికృష్ణ ఇద్దరు పిల్లలు. సాయిలీల చంగిచర్లలోని బీఎంఆర్‌ఎస్ స్కూల్లో 10 వతరగతి చదువుతోంది. శనివారం కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సాయిలీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ ఎం. రవిచందన్‌రెడ్డి, మేడిపల్లి ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి, ఎస్ఐ ప్రేమ్‌సాగర్ సంఘటన స్థలానికి, కాకతీయ హాస్పిటల్‌కు వెళ్లి వివరాల సేకరించారు. సాయిలీల తల్లిదండ్రులను పరామర్శించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని వివరాలు తెలుస్తాయని ఏసీపీ వెల్లడించారు. బాలిక మృతిని తోటి విద్యార్థులు,కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.