జనవరి 31 ప్రీతి పెళ్లి?

నలభై ఏళ్ల బాలివుడ్ నటి, మోడల్ ప్రీతీజింతా పెళ్లి చేసుకోబోతున్నారా? ఆమె చేసుకోబోతున్నది అమెరికాలోని ఆమె బాయ్‌ఫ్రెండ్ జీన్ గుడెనఫ్ నేనా? ఇటీవల ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తున్నది అతడి కోసమేనా?... ఇవన్నీ పాత ప్రశ్నలు. మరి కొత్త ప్రశ్నలు ఏమిటి? ఏమీ లేవు. కొత్త విషయం మాత్రం ఉంది. ప్రీతి వచ్చే జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నారట. అదీ జనవరి 31న. ఆ డేట్‌కి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది.
అది ప్రీతి బర్త్ డే. ప్రీతి పెళ్లి సంగతి దాదాపుగా కన్ఫామ్ అయింది కానీ... ఆమె చేసుకోబోతున్నది సేమ్ ఓల్డ్ అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నేనా అన్నది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే ప్రీతి ఈ పెళ్లి డేట్లు, మంత్‌లపై ట్విట్టర్‌లో నెత్తీ నోరు మొత్తుకున్నారు. ‘నేనేం జనవరిలో పెళ్లి చేసుకోవడం లేదు. మీకు ప్రామిస్ చేసి చెబుతున్నా... చేసుకునే ముందు మీకు చెప్పే చేసుకుంటా’ అని అసహనంగా ట్వీట్ చేశారు. ‘జనవరిలో కాదా... అయితే ఈ డిసెంబరులో చేసుకుంటున్నారన్నమాట... థ్యాంక్స్’ అని వెంటనే ఓ ట్వీట్ వచ్చింది. దానిపై ట్విట్టర్‌లోనే ప్రీతి ‘గుర్‌రరర్..’ మన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి