సెప్టెంబర్ 4 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 4, the day the celebration of the birth of the purchase Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 4 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Sep 4 2015 1:00 AM | Updated on Sep 3 2017 8:41 AM

సెప్టెంబర్  4 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 4 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న రిషి కపూర్ (నటుడు), కిరణ్ మోరె (మాజీ క్రికెటర్)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వీరు పుట్టిన తేదీ 4. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. రాహువు ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి, కంప్యూటర్ పరిజ్ఞానానికీ చిహ్నం. అందువల్ల అసాధ్యమనుకున్న పనులు కూడా చాలా తక్కువ శ్రమతో పూర్తి చేయగలరు. పరిశోధన రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, ఆదాయ వృద్ధి ఉంటుంది.

పెండింగ్‌లో ఉన్న కోర్టుకేసులలో అనుకూలమైన తీర్పు వస్తుంది.అయితే ఈ సంవత్సరం అనవసర వివాదాల జోలికి పోకుండా ఉండటం, ఒకవేళ సమస్య ఏమయినా వస్తే పట్టుదలకు పోయి పోలీస్‌స్టేషన్ లేదా కోర్టుదాకా పోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3,4, 6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, గురువులను, పండితులను ఆదరించడం, పౌరాణిక గ్రంథాలను పఠించడం, ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement
 
Advertisement
Advertisement