సెప్టెంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 10, the day of birth jarupukontunna Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Sep 10 2015 12:01 AM | Updated on Sep 3 2017 9:04 AM

సెప్టెంబర్  10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
అనురాగ్ కశ్యప్ (దర్శకుడు), అతుల్ కులకర్ణి (నటుడు) జయం రవి (నటుడు)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది. ఎంతోకాలంగా ఉన్న కోర్టుకేసులలో విజయం కలుగుతుంది. విద్యార్థులు మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. యూనిఫారం ధరించే ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అయితే కుజుని ప్రభావం వల్ల ఆయుధ లేదా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తత అవసరం. అదేవిధంగా అనాలోచితమైన మాటతీరు వల్ల ఎనలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడటం మంచిది. వీరి పుట్టిన తేదీ అయిన 10 సూర్యునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.

ఏ కార్యాన్నైనా ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా, ధైర్యసాహసాలతో చేసి, మంచి పేరు తెచ్చుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరెంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్ ; లక్కీ డేస్: మంగళ, గురు, ఆదివారాలు. సూచనలు: గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరోగ్యపరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యారాధన, శివాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, వికలాంగులకు ఊతమివ్వడం, సోదరులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement
 
Advertisement
Advertisement