భర్తా అధ్యక్షుడే..కొడుకూ అధ్యక్షుడే!

Husband  and son is president - Sakshi

1925–2018 

సీనియర్‌ జార్జిబుష్‌ భార్య బార్బారా బుష్‌ మంగళవారం యు.ఎస్‌.లోని హ్యూస్టన్‌లో తన 92వ యేట కన్ను మూశారు. బార్బారా కన్నా బుష్‌ ఏడాది మాత్రమే పెద్ద. ఇద్దరూ జూన్‌ నెలలోనే పుట్టారు. ప్రస్తుతం ఆయన భార్య పోయిన విషాదంలో ఉన్నారు. బార్బారా మరణించిన ఈ సమయంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు ఇవి. 

►బార్బారాకు తన 16వ యేట ఒక డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో బుష్‌తో పరిచయం అయింది. 
►బుష్‌తో పెళ్లి కాక మునుపు ఆమె పేరు బార్బారా పియర్స్‌. అమెరికా 14వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ పియర్స్‌.. బార్బారాకు దూరపు బంధువు అవుతారు. 
►రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1943 వేసవిలో బార్బారా న్యూయార్క్‌లోని నట్టులు, బోల్టులు తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేశారు. 
►యు.ఎస్‌.లో అక్షరాస్యత కోసం కృషి చేసిన తొలి ప్రథమ మహిళ బార్బారా. 
►అమెరికా చరిత్రలో భర్త, కొడుకు ఇద్దరూ అధ్యక్షులుగా పనిచేసిన రెండో మహిళ బార్బారా. మొదటి మహిళ అబిగెయల్‌ ఆడమ్స్‌. (భర్త జాన్‌ ఆడమ్స్‌ 2వ అమెరికా అధ్యక్షుడు. కొడుకు జాన్‌ క్విన్సీ 6వ అమెరికా అధ్యక్షుడు).
► బార్బారా భర్త సీనియర్‌ బుష్‌ 41వ అమెరికా అధ్యక్షుడు. బార్బారా కుమారుడు జూనియర్‌ బుష్‌ 43వ అమెరికా అధ్యక్షుడు. 
►బార్బారా మృదుభాషి. బార్బారా అనగానే తెల్లజుట్టు, ముత్యాల హారం, చెవిదుద్దులు స్ఫురణకు వస్తాయి. 
►భర్త అమెరికా అధ్యక్షుడయ్యాక రాజకీయంగా ఆమె ప్రాధాన్యం మరింత పెరిగింది. వైట్‌ హౌస్‌ను వదిలిపెట్టాక ఇద్దరు కుమారులకు (జూ‘‘ బుష్, జేబ్‌)లకు బార్బారా ప్రసంగ ప్రతినిధిగా ఉన్నారు. 
►బార్బారా మహిళా హక్కుల కోసం ఉద్యమం నడిపారు.
- బార్బారా బుష్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top