మడతడిపోద్ది... | How I Built My First Electric Bike | Sakshi
Sakshi News home page

మడతడిపోద్ది...

Nov 7 2015 11:58 PM | Updated on Nov 6 2018 4:42 PM

మడతడిపోద్ది... - Sakshi

మడతడిపోద్ది...

ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్... ఈ-సైకిలే. మరేం లేదు... ఇది ఎలక్ట్రానిక్ సైకిల్.

ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్... ఈ-సైకిలే. మరేం లేదు... ఇది ఎలక్ట్రానిక్ సైకిల్. ‘సిట్ గో’ పేరిట రూపొందించిన ఈ సైకిల్‌ను నడపాలంటే, కాళ్లకు పనిచెప్పి తొక్కాల్సిన పనేమీ ఉండదు. రద్దీ రోడ్ల మీద ప్రయాణాలకు అనువుగా, ఇది చాలా తేలికగా ఉంటుంది. అంతేకాదు, దీనికి పార్కింగ్ బెడద కూడా లేదు. నిలిపి ఉంచాల్సి వస్తే, శుభ్రంగా మడిచేస్తే చాలు, మడతడిపోద్ది. ఇంట్లోకైనా, ఆఫీసులోకైనా... ఇంకెక్కడికైనా... మడిచేసిన సైకిలును ఇంచక్కా సూట్‌కేసులా మోసుకుపోవచ్చు. లిథియం బ్యాటరీతో పనిచేసే 180 వాట్ల బ్రష్‌లెస్ మోటారుతో నడిచే ఈ సైకిలు గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఒకసారి బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తే, ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇంట్లో వాడే 220 వోల్టుల ప్లగ్‌ల ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సైకిల్‌కు ఇమిడి ఉన్న యూఎస్‌బీ పోర్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్లు వంటి వాటిని ప్రయాణ సమయంలో చార్జ్ చేసుకునే వెసులుబాటూ ఉంది. స్మార్ట్ వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది హాంకాంగ్‌లో బృందంగా ఏర్పడిన అంతర్జాతీయ డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. మార్కెట్‌లో ఇది అందుబాటులోకి వచ్చే నాటికి దీని ధర 700 డాలర్ల వరకు (రూ.46 వేలు) ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ డిజైనర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement